అమెరికా వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతున్న వేళ డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ వాషింగ్టన్ డీసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ ఫోన్ కాల్స్ ద్వారా ఓటర్లను ప్రోత్సహిస్తున్న వాలంటీర్లను ఆమె పలకరించారు. ఈ క్రమంలోనే పలువురు ఓటర్లతో మాట్లాడి.. ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.