షావోమి ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ ఈ ఏడాది చివరి నాటికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆరు సంవత్సరాలు కంపెనీలో పని చేసిన మురళీకృష్ణన్ రీసెర్చ్ వైపు వెళుతున్న కారణంగా కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే తన పదవికీ రాజీనామా చేసినప్పటికీ స్వతంత్ర వ్యూహాత్మక సలహాదారుగా కొనసాగుతారని సంస్థ వెల్లడించింది.