రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నిరకాల సర్వీసెస్‌ను ఒకే చోట అందించే ఓ సూపర్ యాప్‌ను డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని భారతీయ రైల్వేకు చెందిన సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ యాప్‌ను CRIS డెవలప్ చేస్తోందని, IRCTCతో అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతోందని వెల్లడించాయి. కాగా ఈ యాప్ అందుబాటులోకి వస్తే టికెట్ బుకింగ్, ఫ్లాట్ ఫామ్ టికెట్, ఫుడ్ ఆర్డర్ వంటివి ఒకే చోట బుక్ చేసుకోవచ్చు.