ప్రకాశం: ప్రజల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 8 నుంచి 15 వరకు చేపట్టే ప్రజా పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ అన్నారు. శనివారం సిఎస్ పురం సీపీఎం పార్టీ కమిటీ సమావేశం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాలైన సూపర్ సిక్స్ పథకాలతో పాటు చంద్రబాబు నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం చేసిన వాగ్దానాలాన్నింటినీ అమలు చేయాలన్నారు.