NLR: జిల్లాలో రైతుల భాగస్వామ్యంతో కాలువల్లో పూడిక తీత పనులు (ఓ అండ్ ఎం) ముమ్మరంగా జరుగుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండల పరిధిలోని తాటిపర్తి, సూరాయపాళెం వద్ద కనుపూరు కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. వైసీపీ పాలనలో కాలువల్లో ఒక్క తట్ట మట్టి తీయకుండానే చేసుకున్నారని ఆరోపించారు.