ఖాతాదారులకు HDFC బ్యాంక్ చేదు వార్త చెప్పింది. రెండు రోజుల పాటు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) పని చేయదని తెలిపింది. ఈ సమాచారం HDFC వెబ్సైట్లో ఇవ్వబడింది. ఈ సేవలు నవంబర్ 5న 2 గంటలు, నవంబర్ 23న 3 గంటల పాటు అందుబాటులో ఉండవు. బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, అవసరమైన సిస్టమ్ నిర్వహణను చేపట్టనున్నామని బ్యాంక్ పేర్కొంది.