ప్రకాశం; కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ కో ఆర్డినేటర్‌గా కైపు వెంకట కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నుంచి ఉత్తర్వులు అందినట్లు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి కో ఆర్డినేటర్ పదవికి ఎంపిక చేసినందుకు షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.