శివసేన మహిళా నేతకు ముంబయి దక్షిణ ఎంపీ అర్వింద్ సావంత్ క్షమాపణలు చెప్పారు. శివసేన మహిళా నేత షైనాను ఉద్దేశిస్తూ శివసేన (యూబీటీ) నేత అర్వింద్ సావంత్ సరుకు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపాయి. ఎంపీ వ్యాఖ్యలపై షైనా ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా దీనిపై స్పందించిన సావంత్ ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని వివరించారు.