TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. లబ్ధిదారుల కోసం ఒక యాప్ డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. నాలుగు దశల్లో ఇండ్ల కేటాయింపు చేపట్టనున్నట్లు చెప్పారు. 400 చదరపు అడుగులలో ఇల్లు నిర్మాణం ఉంటుందన్నారు. సొంత స్థలం ఉన్నవారికి దశల వారీగా రూ. 5 లక్షలు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇంటి యజమానిగా మహిళలను ఎంపిక చేస్తున్నామని ప్రకటించారు.