ASR: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. అనంతగిరి మండలం శివలింగపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను శనివారం సందర్శించారు. పాఠశాలలో రికార్డులను పరిశీలించారు. వసతిగృహం, వంట గదులను, విద్యార్థులకు వండిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు.