TG: సీఎం రేవంత్ రెడ్డితో అన్ని యూనివర్సిటీల నూతన వీసీలు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని తెలిపారు. వర్సిటీల గౌరవం పెంచాలని వీసీలకు దిశానిర్దేశం చేశారు. వర్సిటీలను 100 శాతం ప్రక్షాళన చేయాలన్నారు. తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు.