తిరుపతి: వడమాలపేట మండలం ఏ.ఎం. పురానికి చెందిన చిన్నారి హత్యాచారం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, బాధిత కుటుంబానికి రు.10 లక్షలు పరిహారం ప్రకటించినట్లు ఎమ్మెల్యే భాను ప్రకాష్ తెలిపారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.