AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పట్ల మాధవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుకు ఆమె ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్లు మాధవ్ వెల్లడిస్తున్నారని.. ఆ విధంగా అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించడం దుర్మార్గమని తెలిపారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.