SRD: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. కంది మండలం ఆరుట్ల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రైతుల పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. సన్న వడ్లకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.