AP: కర్నూల్ జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాలలో ఆందోళన వాతావరణం నెలకొంది. యురేనియం తవ్వకాలు ఆపాలంటూ గ్రామస్తులు నిరసనకు దిగారు. గ్రామంలోకి ఆర్టీసీ బస్సులు రాకుండా అడ్డగించారు. అధికారులను ఊర్లోకి అనుమతించలేదు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామస్థుల ఆందోళనతో కర్నూలు-బళ్లారి రహదారిపై రాకపోకలు ఆగిపోయాయి. కాగా, కప్పట్రాళ్ల రక్షిత అడవిలో కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు 68 బోర్లకు అనుమతిచ్చింది.