KNR: ఉమ్మడి జిల్లాలో చలి మొదలైంది. ధర్మారం మండలంలో ఈరోజు ఉదయం పొగ మంచు కమ్మేసింది. ధర్మారం, నంది మేడారం సహా పలు గ్రామాల్లో ఓ వైపు చలి, మరోవైపు పొగ మంచు కమ్మేయడంతో అంతా చీకటిగా మారింది. రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు రోడ్లు కనిపించక ఇబ్బంది పడుతున్నారు. కాగా, పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందన్నారు.