GNTR: ఎన్టీఆర్ భరోసా పేరిట పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని మంగళగిరిలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే నిర్వహించారు. కమిషనర్ అలీం భాష పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నాయకులు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లి నగదును అందజేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ నగదును అందుకున్నారు.