పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ శుక్రవారం ఉదయం పట్టణంలో గాంధీ నగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం తొలిరోజు శతశాతం పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. సిబ్బంది శరవేగంగా పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు.