KMR: జిల్లాలో నేటి నుంచి నవంబర్ 7వ తేదీ వరకు 30, 30(ఎ) యాక్టు అమలులో ఉంటుందని ఎస్పీ సింధూ శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.