దీపావళి పండగ జరిగిన నెలరోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్లో బుద్ధి దీపావళి నిర్వహిస్తారు. ఇది మామూలు దీపావళిలాగా ఉండదు. పెద్ద తాడుతో మానవహారంగా ఏర్పడి అక్కడి ప్రజలు నృత్యాలు చేస్తారు. వీధుల్లో వాయిద్యాలు వాయిస్తూ.. తిరుగుతారు. రాత్రి కాగానే పెద్ద కాగడాలకు మంటలు అంటించి జానపద పాటలతో చిందులేస్తారు. ప్రత్యేక పిండి వంటలను తోటి వాళ్లతో పంచుకుంటారు. అయితే, ఈ కోలాహలంలో బయటివాళ్లకు అనుమతి ఉండదు.