ELR: ఏలూరులో గురువారం జరిగిన దీపావళి టపాసుల పేలుళ్లలో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను, ప్రమాదంలో గాయపడిన కుటుంబాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పరామర్శించారు. ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.