W.G: స్వాతంత్య్రం వచ్చాక భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ దేశరక్షణ, సమగ్రతకు ఎంతో కృషి చేశారని డిప్యూటీ కలెక్టర్ భాస్కరరావు అన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో గురువారం ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ DRO భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.