KNR: బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామానికి చెందిన సోము శంకర్ (33) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంకర్ పీజీ వరకు చదువుకున్నాడు. ఇటీవల డీఎస్సీ పరీక్ష రాసి ఎంపిక కాలేదు. మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.