VZM: పూసపాటిరేగ మండలం ఎరుకొండలో గురువారం డయేరియాతో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఇద్దరిని పూసపాటిరేగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తాగునీరు కలుషితం వల్లే డయేరియా సోకిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎంపీడీవో రాధిక, తహసీల్దార్ తాడి గోవింద, వైద్యాధికారి రాజేష్ వర్మ, వైద్య సిబ్బంది గ్రామాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు.