TG: హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలతో కలిసి గ్రేటర్ కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. మూసీ వెంట దుర్భర జీవితాలు గడుపుతున్న వారితో దీపావళి వేడుకలు చేసుకోవాలంటూ కేటీఆర్కు పిలుపునిచ్చారు. కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ఫొటోలను ఏర్పాటు చేసి బొకేలతో స్వాగతం చెబుతూ నిరసన తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో నిద్ర చేయాలంటూ కాంగ్రెస్ నేతలు మడత మంచాలను ఏర్పాటు చేశారు.