గుజరాత్‌లోని కచ్‌లో BSF సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలను జరుపుకున్నారు. మోదీ వారితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన చేతులతో సైనికులకు మిఠాయిలు తినిపించారు. గుజరాత్ కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలోని లక్కీ నాలా వద్ద BSF, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలిసి ప్రధాని దీపావళి సంబురాలు జరుపుకున్నారు.