NLR: నెల్లూరు నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన ఓ మహిళకు గురువారం పురిటినొప్పులు వచ్చాయి. 108 అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చిన కుటుంబసభ్యులు ఆమెను తీసుకుని ఆటోలో ఎదురెళ్లారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి నివాసం వద్ద ఆటోలో నుంచి అంబులెన్స్‌లోకి ఎక్కించి అక్కడే ప్రసవం చేశారు. సోమిరెడ్డితో పాటు ఆయన కోడలు శృతిరెడ్డి చిన్నారిని ఎత్తుకున్నారు.