ప్రకాశం: మాల ఉద్యోగులు జేఏసీ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగస్తులు, మాల సంఘం నాయకులు గురువారం సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ని మర్యాదపూర్వకంగా కలిశారు. వర్గీకరణ క్రిమిలేయర్ గురించి వారు ఎమ్మెల్యేతో చర్చించారు. వర్గీకరణ తీర్పు వలన మాల జాతి అనేక విధాలుగా నష్టపోతుందని, సోదరుల్లా కలిసి ఉండే మాల మాదిగలను విభజించేందుకు వర్గీకరణ చిచ్చు పెట్టిందని వివరించారు.