ఎన్టీఆర్: హిందూ ధార్మిక రక్షణ, బ్రాహ్మణుల అభివృద్ధికి NDA ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా గురువారం ట్వీట్ చేశారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం వేద విద్య అభ్యసించి ఉపాధి లేకుండా ఉన్న వేద పండితులకు నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందన్నారు. ఈ క్రమంలో మరొక ఎన్నికల హామీని NDA ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొన్నారు.