ASR: కొయ్యూరు మండలం బకులూరు గ్రామ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు ఏర్పాటు చేయాలని బాలారం పంచాయతీ సర్పంచ్ అప్పలనర్స గురువారం కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ బకులూరు సచివాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలన్నారు.