ASR: దేశంలో పేదరిక నిర్మూలనకు దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ విశేష కృషి చేశారని పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి అన్నారు. ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరు పొందారని కొనియాడారు. అరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాగాంధీ 40వ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.