మహారాష్ట్రలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడి ఓటర్ల జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించింది. అయితే, ఇందులో తొలి ఓటర్లు కేవలం 2శాతం మాత్రమే కావడం గమనార్హం. మొత్తం ఓటర్లలో 5 కోట్ల మందికి పైగా పురుషులు కాగా.. 4.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 18-19 ఏళ్ల వయసు గల తొలి ఓటర్లు 22.22 లక్షల మంది అని ఈసీ తెలిపింది.