TG: మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి KTR దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఇవాళ నాంపల్లి కోర్టు మరికొందరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే KTR, BRS నేత దాసోజు శ్రవణ్‌కుమార్ వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇప్పుడు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ వాంగ్మూలాలను రికార్డు చేయనుంది. కాగా, సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన కేసులో వివరణ ఇచ్చేందుకు మంత్రి సురేఖ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.