TG: జన్వాడ ఫామ్‌హౌజ్ రేవ్ పార్టీ కేసులో నిందితుడైన రాజ్ పాకాల అజ్ఞాతంలో ఉన్నారు. అతని మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. రేవ్ పార్టీ కేసులో రాజ్ పాకాల ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అందుబాటులో లేకపోవటంతో అతని ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. విచారణకు రాకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.