TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 31న దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్నారు. అయితే దీపావళి ఆస్థానం దృష్ట్యా VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు TTD అధికారులు తెలిపారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు వివరించారు. బుధవారం సిఫారసు లేఖలు తీసుకోబోమని TTD అధికారులు స్పష్టం చేశారు.