TG: ఫామ్ హౌజ్ పార్టీ కేసులో మోకిల పోలీసులు విజయ్ కుమార్ మద్దూరిని అదుపులోకి తీసుకున్నారు. నేడు అతని విచారణ ముగిసింది. రేపు మళ్లీ విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా రాజ్ పాకాల ఇంట్లో ఇప్పటికే ఆరు గంటల పాటు సోదాలు జరిపారు. రేపటి లోపు రాజ్ పాకాల లొంగిపోకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని పేర్కొన్నారు.