KDP: అట్లూరు మండల పరిధిలోని దీపావళి బాణాసంచా విక్రయదారులు అనుమతి పొందాలని SI రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మండలంలోని 12 గ్రామపంచాయతీ గ్రామాల్లో పోలీస్ నిబంధన పాటించాలన్నారు. లైసెన్సులు పొందిన వారు మాత్రమే దీపావళి సామాగ్రి విక్రయించాలని తెలిపారు. అనుమతులు పొందకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.