HYD: HYD శివారు కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగరంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. విగ్రహాలను తయారు చేసే షెడ్డులోకి పాము రావడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ రాజు అక్కడికి చేరుకొని భారీ ఆకారంలో ఉన్న పాముని బంధించారు. అనంతరం అడవిలో వదలిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.