భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషాన్ తండ్రి ప్రణవ్ పాండే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (JDU)లో చేరారు. ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా సమక్షంలో పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ప్రణవ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. సీఎం చేపట్టే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానన్నారు.