విశాఖ: ప్రతీ ఇంటి మీద మిద్దె తోటలు పెంచాలి అని వనమాలి, సీటీజీ సంస్థలు విశాఖలో ఆదివారం 13 ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. “ఇచ్చి పుచ్చుకునే” విధానంలో కూరగాయల మొక్కలు, అంట్లు, విత్తనాలు పంపిణీ చేశారు. ఎకో వైజాగ్లో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఒ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం ఆకుకూరల విత్తనాలు పంపిణీ చేశారు.