TG: ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే.. కేటీఆర్ కుటుంబంపై దాడి చేస్తున్నారని మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ‘నిన్న డ్రగ్స్ ఆనవాళ్లు దొరకలేదని చెప్పారు. కొత్తగా ఎఫ్ఐఆర్ డ్రామా చేస్తున్నారు. పార్టీ జరిగిన ప్రాంతంలో కాకుండా.. ఇంటి దగ్గర హడావుడి చేస్తున్నారు. పోలీసులే ఇంట్లో ఏదోకటి పెడతారని అనుమానంగా ఉంది. డీజీపీ, ప్రభుత్వంపై నమ్మకం లేదు’ అని పేర్కొన్నారు.