తమిళనాడు విల్లుపురంలో హీరో విజయ్ మహానాడు నిర్వహించారు. TVK పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ‘పాములాంటి రాజకీయాలతో ఆడుకుంటున్నా. మేం రాజకీయాలకు కొత్త, పాము కాటేస్తుందని తెలుసు. మాకు ఎలాంటి భయం లేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులను విమర్శించి.. దేవుడు లేడన్న పెరియార్ మాటలను మేం వ్యతిరేకం. మత రాజకీయాలను ప్రోత్సహించం. మేం పెరియార్ సిద్ధాంతాలను అనుసరిస్తే.. కొందరు మమ్మల్ని టార్గెట్ చేస్తారు’ అని పేర్కొన్నారు.