KDP: జన విజ్ఞాన వేదిక నిర్వహించే రాష్ట్ర స్థాయి చెకుముకి టాలెంట్ పరీక్ష పోటీలకు మైదుకూరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఆదివారం కడప జిల్లా స్థానిక ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన జిల్లాస్థాయి చెకుముకి టాలెంట్ పరీక్షల్లో శాంతినికేతన్ స్కూల్కు చెందిన విద్యార్థులు ముని రాఘవ, వెంకట నాగ భావన, హర్షవర్ధన్లు విశేష ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు.