AP: మాజీ సీఎం జగన్, కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య వివాదంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తి తగాదా అయితే పరిష్కరించుకోవచ్చని.. అయితే అది ఆస్తి తగాదా కాదని, అధికారం కోసం తగాదా అని అన్నారు. షర్మిల పెట్టె ప్రెస్మీట్లలో 95 శాతం వైసీపీని జగన్ను తిట్టడానికే అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటానికే షర్మిల మాట్లాడుతున్నారని విమర్శించారు.