ప్రకాశం: సంతమాగులూరులోని గ్రంథాలయ శాఖలో ఆదివారం లైబ్రేరియన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘చదవడం మాకు ఇష్టం’ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని విజయభాస్కర్ రెడ్డి సూచించారు