సల్మాన్ ఖాన్‌కు రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ మరోసారి సలహా ఇచ్చారు. ‘బిష్ణోయ్ తెగతో సల్మాన్‌కు ఎప్పటి నుంచో వివాదం ఉన్న విషయం తెలిసిందే. ఇది ఒక వ్యక్తి సమస్య కాదు.. ఒక తెగ నమ్మకాలకు సంబంధించింది. అందుకే సల్మాన్ ఇప్పటికైనా బిష్ణోయ్‌లకు సంబంధించిన ఏదైనా ఆలయానికి వెళ్లి, గతంలో తాను చేసిన తప్పుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేదంటే ఈ సమస్య ఇంతటితో ఆగదు‘ అని అన్నారు.