ప్రకాశం: కనిగిరిలోని వివిధ లాడ్జీలను హనుమంతునిపాడు ఎస్సై కే.మాధవరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లాడ్జిలలో ఉంటున్న వారి వివరాలను పరిశీలించారు. ఐడీ కార్డులను పరిశీలించి ఎక్కడ నుంచి వచ్చారనే వివరాలు ఆరా తీశారు. లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే చర్యలు తీసుకుంటామని, అనుమానిత వ్యక్తులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.