TG: రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో టీచర్ల కొరత ఉంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్ ప్లస్ ఉన్న ఉపాధ్యాయులను టీచర్ల కొరత ఉన్న స్కూళ్లకు షిష్ట్ చేస్తోంది. అందులో భాగంగా దాదాపు 860 మందికి పైగా టీచర్లను ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసంది. ఇదిలాఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల వారీగా డేటాను పంపించాలని ఈనెల 15న విద్యాశాఖ డీఈవోలకు ఆదేశించారు.