ప్రకాశం: శేఖర్ పురం మండలంలోని గుంతబాసుపల్లి గ్రామ పరిధిలో ఫోరెస్ట్, రెవిన్యూ భూములను శనివారం ఫారెస్ట్ రేంజర్ ఉమామహేశ్వర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. రెవెన్యూ భూములను, ఫారెస్ట్ భూములను గుర్తించి వాటికి హద్దురాళ్లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, మండల సర్వే బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.