TG: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక యాప్ను తీసుకొస్తున్నామని తెలిపారు. తాజాగా యాప్నను పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు. యాప్లో తెలుగు వెర్షన్ కూడా ఉండేలా చూడాలని అధికారులకు తెలిపారు.